Wednesday, 30 November 2016


వినవయ్య వినవయ్య ఓ తెలుగోడా..!!
మనస్సు విప్పి కళ్ళు తెరిచి విను విను..!!
మాతృ భాష గొప్పతనం..!!
అందులోని అమృతత్వం..!!
ఎందులోను  కానరాదయ్య..!!

ఇంగిలిపీసు కులుకు పలుకులు ఏలానయ్య..!!
తెలుగు పలుకు విశ్వ పలుకు అయ్యే రోజు ముందుందయ్య..!!
బ్రహ్మలిపిలో నుండి ఉద్భవించిన భాష మనదయ్య..!!
ప్రపంచ ఉత్తమ లిపిలలో రెండవది మన తెలుగయ్య..!!

మధురమైన లిఖితం కమనీయ వచనం..!!
మన తురంగ సంధాన భాష పద కుసుమాల వనం..!!
సొగసైన సరిగమల రాగం రమణీయ సుశ్రవణం..!!
మన అంతరెంద్రియము పలికే సాహిత్య గంధర్వ గానం..!!

నింగిలోని తారలే మన తెలుగు అక్షరాలై..!!
సూర్య చంద్రులే అచ్చు హల్లులై..!!
నాలుగు మాండలికాలే నాలుగు దిక్కులై..!!
తెలుగు భాష విశ్వ భాషగా సింహాసనం అదిష్టించాలి..!!

తెలుగు వారికి పరమేశ్వరుడిచ్చిన పరమ ఔషదమే మన తెలుగు భాష..!!
భావితరాలకు చక్కని చిక్కని తెలుగు భాషను అందించు..!!
శత కోటి దండబులు సమర్పించుతున్నది..!!
కవి మిత్రులకు  ఈ అఖిలాశ ..!!


తెలుగు రక్షణ వేదిక నిర్వహించిన జాతీయ కవి సమ్మేళనంలో చదివిన కవిత 

కలం పేరు :- అఖిలాశ 
మీ 
జాని.తక్కెడశిల 

అఖిలాశ కై  ఆశలు 





ఆశలెన్నో పెట్టుకున్న 
అశువుల భాషలు చెప్పుకోవాలని

ఉహలెన్నో ఉహించుకున్న
నిదుర లోని కల వలె చెదిరిపోయే
ఆదరాల రాగాలెన్నో విందాము అనుకున్న
సంద్ర కెరటం వలె కూలిపోయే
గత  స్మ్రుతులెన్నో స్మరించాలి అనుకున్న
గాలి లోని దీపం వలె ఆరిపోయే
దేహ క్రిడలెన్నో ఆడాలనుకున్న
ఆశలు అడిఅశాలు అయిపోయే
వన్నె కన్యల వలపు సొగసులెన్నో
నింపుకున్న నిత్య సుందరాంగి
మదిని వలచి గెలిచి
విరహాల విరిపాలతో
నన్ను కైవసించి
వగల సెగల
నగ నగ  అంద చందాల
మందార అఖిలాశ
నయనాలు నిరతం
నికోరకే నిరిక్షిస్తునాయి
రేపటి అమృతోదయంకై

మీ
  జాని.తక్కెడశిల