Friday 9 December 2016


తప్పెవరిది?



 


శ్రేష్ఠ పదహారు సంవత్సరాల అమ్మాయి. ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం చదువుతోంది. తండ్రి కుటుంబరావు చిరు ఉద్యోగి. తల్లి సూర్యకాంతం గృహిణి. ఇదీ వారి అందమైన కుటుంబం. కుటుంబరావు శ్రేష్ఠని ప్రతిరోజు తనే దగ్గరుండి కాలేజీకి తీసుకువెళ్లి.. ఆ తర్వాత ఆఫీసుకు వెళ్ళి.. మరల తన కూతురిని తిరిగి సాయంత్రం కాలేజీ నుండి ఇంటికి తీసుకువచ్చేవాడు. ఇదీ అతని దినచర్య.
ప్రతీరోజు లాగే ఆ రోజు కూడా కుటుంబరావు శ్రేష్ఠని.. కాలేజ్ ఆవరణలో వదిలి తన కార్యాలయానికి వెళ్ళాడు. కాని సాయంత్రం ఎప్పటి లాగే ఆమెను తీసుకురావడానికి రాలేదు.  కాలేజీ వదిలాక..  శ్రేష్ఠ తండ్రి కోసం ఎదురుచూస్తూ ఉంది. విద్యార్థులు, లెక్చరర్లతో పాటు మిగతా స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు.
ఆ సమయంలో లెక్చరర్ చలపతి అటువైపు వెళ్తూ  శ్రేష్ఠని చూసి ‘‘ఏమైందీ.. ఇంకా ఇంటికి వెళ్ళలేదు .. నాన్నగారు రాలేదా’’ అని కారణం అడుగుతారు. ‘‘అవును సార్ ’’ అని సమాధానం తెలిపిన  శ్రేష్ఠ కంగారుపడటం గమనించి ఆయన ‘‘కంగారు పడకు శ్రేష్ఠ.. నాన్నగారి ఫోన్ నంబర్ చెప్పు’’ అని నంబరు అడిగి తీసుకొని.. ఆ నంబరుకి కాల్ చేస్తారు.  కుటుంబరావు మీటింగ్‌లో ఉండటం చేత కాల్ రిసీవ్ చేయలేదు. అప్పుడు చలపతి ‘‘సరే శ్రేష్ఠ.. నాతో పాటు రామ్మా.. నేను ఇంటి వద్ద వదిలేస్తాను’’ అని చెప్పి శ్రేష్ఠని తన స్కూటర్ మీద తీసుకెళ్లి ఆమెను ఇంటి దగ్గర క్షేమంగా వదిలిపెడతారు. 
అప్పుడే హడావుడిగా ఇంటికి వచ్చిన కుటుంబరావు శ్రేష్ఠని చూసి ‘‘వచ్చావా శ్రేష్ఠ..  క్షమించమ్మా.. ఆఫీస్లో మీటింగ్ ఉండటంతో ఆలస్యం అయింది’’ అని అంటారు. ‘‘ఎలా వచ్చావు’’ అని అడిగితే ‘‘మా సార్ చలపతి గారు తీసుకొచ్చారు నాన్న’’ అని చెబుతుంది శ్రేష్ఠ. 
‘‘అవునా ! సరే.. సరే. వెళ్ళి రెడీ అవ్వు.. సినిమాకి వెళ్దాము’’ అని అంటారు ఆమె తండ్రి. ఆ తర్వాత శ్రేష్ట, తన తల్లిదండ్రులతో కలిసి సినిమాకి వెళ్ళి బయట డిన్నర్ చేసి ఇంటికి వస్తుంది. బాగా అలసిపోవడంతో త్వరగా పడుకోవడానికి పక్క సిద్దం చేసుకుంటారు అందరూ.  తల్లితండ్రి ఒక్క చోట,  శ్రేష్ఠ ఒక మంచంలో పడుకుంటారు. రెండు మంచాల మధ్య నడవటానికి కొద్దిగా గ్యాప్ ఉంది.  
శ్రేష్ఠ అలసిపోవడంతో త్వరగా నిద్రపోతుంది. శ్రేష్ట తల్లి సూర్యకాంతం కుటుంబరావుని ‘‘ఏం మీటింగ్ అండి.. ఇవాళ ఇంత ఆలస్యం అయ్యింది’’ అని అడుగుతుంది. ‘‘ఏం లేదోయ్ మా ఎమ్.డి  వచ్చారు. అందుకే ఆలస్యం అయింది’’ అని బదులిస్తాడు కుటుంబరావు.
  
ఇద్దరి మధ్య కొద్ది నిముషాల నిశబ్దం రాజ్యమేలుతుంది. ఆ నిశబ్ద రాజ్యాన్ని చీల్చి కుటుంబరావు ‘‘ఏంటోయి ఆలోచన’’ అని అడుగుతాడు.  
‘‘మన శ్రేష్ఠ గురించి అండి..’’ అంటుంది సూర్యకాంతం.
‘‘ఏం ఏమైంది.. నా బంగారు తల్లికి’’ అని అడుగుతాడు కుటుంబరావు.
‘‘ఏం అవ్వలేదు.. కాని మన శ్రేష్ఠ కాలేజ్ 4:30 కే వదులుతారు కదా!!’’
‘‘అవును.. అందులో ఏముంది కాంతం’’ అని ప్రేమగా అడుగుతాడు కుటుంబరావు.
‘‘కాని అమ్మాయి 6:45కి వచ్చింది.. అరగంట ప్రయాణం కదా.. ఎందుకు ఇంత ఆలస్యం అయింది అమ్మాయికి అని నా ఆలోచన’’
‘‘ఏమో మరి అడగకపోయవ..’’ అని కుటుంబరావు అటువైపుగా తిరిగి అంటాడు.
 ఏదో తెలియని అలికిడి వల్ల అప్పుడే లేచిన శ్రేష్ఠ.. తల్లితండ్రుల సంభాషణ వినసాగింది 
‘‘ఎందుకులెండి.. అమ్మాయి బాధపడుతుంది.. ఏమో’’
‘‘అయితే వదిలేయ్’’ 
‘‘కాని.. కాని..’’ 
‘‘ఏంటే నీ బాధ చెప్పు..’’ అని విసుగ్గా అడుగుతాడు కుటుంబరావు.
 
‘‘ఆ లెక్చరర్ చలపతి గురించి..  చాలా మంచి వాడు.. అని అమ్మాయి చాలా సార్లు నాతో చెప్తు ఉండేది అండి. ఈ రోజు మీకు ఆలస్యం అయ్యింది.. అని ఆ చలపతి బైక్ లో వచ్చింది. పైగా ఆలస్యం కూడా అయ్యింది. ఏం జరుగుతుందో ఏమో భయంగా ఉంది..అమ్మాయి బస్ లో కాని ఆటో కాని రావచ్చు కదా !’’ 
కుటుంబరావు ‘‘అబ్బా ఏంటే నీ గోల.. ఇంతకు ఏమంటావ్’’ అని చిరాకు పడతాడు
 
‘‘మన శ్రేష్ఠ ఆ చలపతితో ఎక్కడికైనా వెళ్ళిందా.. అని నా అనుమానం అంతే’’
 
‘‘నోర్ముయ్.. మన శ్రేష్ఠ అలాంటి పని ఎన్నడూ చేయదు.. పిచ్చి పిచ్చి ఆలోచనలు ,అనుమానాలతో బుర్ర పాడు చేసుకోకుండా పడుకో’’ అని తను నిద్రలోకి జారుకుంటాడు.
అయితే ఈ సంభాషణ విన్న శ్రేష్ఠ తన తల్లి తనపై అనుమానం పెంచుకోవడంతో మనసులోనే  కుంగిపోతుంది. ఆమెకు నిద్ర పట్టడం లేదు.. తన తల్లి మాటలు చెవులో మార్మోగుతున్నాయి.....!!! మిన్ను విరిగి మనసు మీద పడినట్లు ఉంది .
సూర్యకాంతం ప్రొద్దునే లేచి భర్తని లేపి వంట తయారుచేసి.. తన కూతురు శ్రేష్ఠ దగ్గరికి  వెళ్ళి నిద్ర లేపాలని తనను  తట్టింది. అయితే ఆమె ఎంత సేపటికి లేవలేదు. ఒక్కసారి తన కూతురిని కదిపి.. ఆ తర్వాత హతాశురాలైంది.
స్నానం చేసి బట్టలు వేసుకుంటున్న  కుటుంబరావు వెంటనే బయటికి వచ్చాడు. భార్యని చూసి ‘‘ఏమైంది కాంతం’’ అని తట్టి లేపాడు. తను  ‘‘ఏమండీ మన అమ్మాయి..’’ అని ఏదో చెప్పబోయింది. వెంటనే తేరుకున్న కుటుంబరావు ‘‘ శ్రేష్ఠ ఎంత పని చేసావు తల్లి’’ అని బిగ్గరగా ఏడ్వడం మొదలుపెట్టాడు. భార్యభర్తలిద్దరూ విపరీతంగా రోదించసాగారు. ఈ విషయం బయటకు పొక్కి.. అదే వీధిలో ఎవరో  పోలీసులకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు.  వెంటనే పోలీసులు వచ్చి అందరిని పక్కకు నెట్టి.. గదిలోకి వెళ్ళి శ్రేష్ఠ మృతదేహాన్ని పంచానామ చేయటానికి ఆసుపత్రికి పంపించి.. గదిని సోదా చేసి ఆమె తల్లిదండ్రులను విచారించారు. 
అప్పుడే దొరికింది శ్రేష్ఠ రాసిన సూసైడ్ నోట్ .. దాన్ని చదవసాగాడు ఎస్సై.
"అమ్మ.. నువ్వు నన్ను అనుమానించావా.. ఆ క్షణమే నా మనసు మరణించింది.  నా పై నీకెందుకు అమ్మ..! అనుమానం ? ఛీ.. ఆ మాట విని కూడా బ్రతకలేను అమ్మ. అందుకే ఈ నిర్ణయం!!! నువ్వే అనుమానించావు అంటే.. ఇంకా బయట ఎందరు ఎన్ని రకాలుగా నా గురించి అనుకుంటున్నారో.. ఆ ఊహే నన్ను చిత్రవధ చేసింది. నువ్వు అన్నట్టు ఆటోలో రావచ్చు. కాని మా కాలేజ్ లో అనాధ పిల్లలకై డబ్బు సేకరించారు. నా దగ్గర ఉన్న డబ్బు అంతా ఇచ్చేసాను...అయినా నాకు ఆటో, బస్ అనే  ఆలోచనే తట్టలేదు.  నాన్న రాలేదు.. ఏమైందో అనే ఆలోచన.. తప్ప నా బుర్ర ఏమి ఆలోచించలేక పోయింది. మా లెక్చరర్ గారు చెప్పే పాఠాలు బాగా అర్థం అవుతాయి. నేను బాగా చదువుతాను కనుక ఆయన నా పై అమిత అభిమానం చూపుతారు. అదే నీకు చెప్పా. అంతేనమ్మ...ఆలస్యానికి గల కారణం.. ఆయన బైక్ మధ్యలో పాడైతే బాగు చేయించుకొని వచ్చాము. నువ్వు అనుకున్నట్లు ఎక్కడికి వెళ్ళలేదు.. ఈ శ్రేష్ఠ శ్రేష్ఠమైనది అమ్మ...
నీకు ఒకసారి అనుమానం వచ్చినది అంటే.. నేను ఏమి చేసినా నీకు అనుమానంగానే  ఉంటుంది. నేను అది భరించలేను. అందుకే అమ్మ ఈ నిర్ణయం...అందుకే నిద్రమాత్రలు మింగాను.  చాలా బాధగా ఉందమ్మ. నాన్నను జాగ్రత్తగా చూసుకో నీ ఆరోగ్యం జాగ్రత్త. వేళకు మందులు వేసుకో.......

ఇట్లు 
మీ 
శ్రేష్ఠ
తప్పు ఎవరిది :-
-----------
శ్రేష్ఠ తన తల్లికి  వచ్చింది అనుమానం అనుకొని.. తను అనుమానపడింది. నిజంగానే ఆమె తన తల్లికి వచ్చింది అనుమానం అనుకున్నట్లయితే.. అ అనుమానాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేయాల్సింది. కనీసం తల్లితో చర్చించాలి లేదా ఆలస్యం గురించి, లెక్చరర్ గురించి మరుసటి రోజు తల్లికి కాని.. తండ్రికి  కాని వివరించాలి. చిన్న విషయానికి తన జీవితాన్ని నాశనం చేసుకొని ఆ యువతి తల్లితండ్రులకు కడుపు కోత  మిగిల్చింది. తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేక పోయింది.ఈ కాలం యువతకి అన్ని విషయాలలోనూ వేగంగా నిర్ణయాలు తీసుకోవడం అలవాటు తన ఆత్మహత్యతో నిరూపించింది. 
తల్లి కొట్టింది అని,నాన్న మందలించారు అని, పరీక్ష పోయింది అని, ప్రేమ అంగీకరించలేదు అని, ఉద్యోగం రాలేదని, భర్త బాధలు పెడుతున్నాడు అని ఇలా ఎన్నో కారణాలతో నేటి యువతరం వారి బంగారు  భవిష్యత్ను బలి చేసుకుంటున్నారు.
ఓ..యువతా.. గుర్తుకు ఉంచుకో. ప్రతి సమస్యకి జవాబు ఉంటుంది. మంచి సంకల్పం ఉండి.. శ్రద్దగా కృషి చేస్తే విజయం నీ దాసోహం కాగలదు. నువ్వు ఆత్మహత్య చేసుకుంటున్నావు అంటే పరోక్షంగా నీ కుటుంబాన్ని నీకు తెలియకుండానే మానసికంగా హత్య చేస్తున్నావు అని అర్థం. 
అందుకే యువత తల్లితండ్రులతో ,పెద్దలతో చర్చించి వారి సూచనలు స్వీకరించాలి. మీ తల్లితండ్రులు ఏది చెప్పినా మీ మంచికేనని గుర్తించాలి.. ఆవేశాన్ని తగ్గించి ఆలోచనతో మెలగడం నేర్చుకోవాలి.                                                                                               ....
మరొక విషయమేమిటంటే.. ఈ కథలో తల్లి పాత్ర తన అమ్మాయిని అనుమానించి.. తన భర్త దగ్గర విషయం చెప్పకుండా.. ఒక తల్లిలా కాకుండా ఒక స్నేహితురాలిలా తన కూతురిని అడిగి విషయం తెలుసుకొని ఉంటే సరిపోయేది. అలాగే శ్రేష్ఠను అమాయకంగా.. కాకుండా ధైర్యంగా పెంచి ఉంటే ఇంకా బాగుండేది. ఈ కాలం అమ్మాయిలను ధైర్యంగా పెంచాలి.. ఎంతటి పరిణామాన్ని అయినా ఎదుర్కొనే నేర్పును వారికి వారి తల్లిదండ్రులు అందివ్వడం వల్ల మాత్రమే ఆత్మహత్యలను నివారించగలం.

"ప్రపంచంలో విజయం , ఓటమి కన్నా.. జీవితం గొప్పది అని వారికి తెలియజేయాలి."

"ఆత్మహత్యలు వద్దు మిత్రుల్లారా "


కలం పేరు:- అఖిలాశ

                                                               ధన్యవాదములు
ఇట్లు, 
మీ భవదీయుడు
జాని.తక్కెడశిల , 
ప్రతిలిపి (తెలుగు విభాగం)
బెంగళూరు
మొబైల్ -7259511956

వాట్స్ అప్ -9491977190

Monday 5 December 2016


ప్రియా నీకే వందనం :-





ప్రియ ప్రియా నీకే నా ప్రియ వందనం 
సఖియా చెలియా సుఖించేనుగా నీతో ..! నేనే..! ఓ ప్రియ ప్రియా ..!
అందానికే నీవేనా చిరునామావి ..!
నీ నామమే నాకు స్వర్గధామమే కదా ..!

వన్నెల అందమే నీదే కదా ..!
నీ అందమే నాకు మకరందమే కదా ..!
కాటుక కళ్ళతో కవ్వించావుగా ..!ఓ ..చెలి ..!
ధీటుగా నేనే బదులిచ్చానుగా ..ఓ ..సఖీ..!

రూపానికే రూపం నీవే కదా ..!
నీ రూపమే నాకు అపురూపమే కదా ..!
నీ.. తియ్యని పలుకులే నాకు బ్రహ్మ వాక్కులే కదా ..!
నేను నీకు దాసోహం.....నీ పెదవి పలకుల కొరకే కదా ..నా చెలి ..!

నా ఊహకు ఊపిరి నీవే కదా ..!
నా ...దేహానికి నీ ఊపిరే ప్రాణవాయువు...!!!
మనమే కలిసి ఉండాలి కలకాలం..!!!

నా పెదవులతో నీ పెదవులనే ముడివేయనా ..!
నీ శ్వాసలో.. నే జీవించనా ..!
నా యదనే.. నీకు చెదరని కోటగా చేయనా ..!
నీ హృదయ ధ్వనులు నాకు మంగళ వాయిద్యాలు కదా ..!

నీ సొగసులకు సర్వ జగత్తు మోకరిల్లేగా ..!
బ్రహ్మకైన సాధ్యం కాదు కదా ..!
మళ్ళీ నీలాంటి అందాన్ని సృష్టించుట..!
ఏ జన్మ తపో ఫలమో నిను పొందుట..!
జన్మ జన్మలకు కావాలి నా ప్రియురాలిగా.!!

కలం పేరు :- అఖిలాశ 


మీ 

జాని.తక్కెడశిల


http://telugu.pratilipi.com/johny-takkedasila/priya-neeke-vandanam

Saturday 3 December 2016



నా జీవితం నీకు అంకితం


ఓ ప్రియ నీవు లేని ఈ జీవ దేహాలు తుష్టంగదే ..!!

నీవు కోరితే నింగిలో మబ్బునై వర్షించి నీవు తిరిగే పుడమిని పులకరించగలవు ..!!

భూగోళన్ని పూల బంతి చేసి నీకు అందించగలను..!! 

సూర్యచంద్రులను నీకు బానిసలుగా చేయగలను..!! 

ప్రకృతిని నీ పెరటిలో నుంచగలను..!!

నింగిని నీ నట్టింట నుంచగలను..!!

పంచభూతాలను నా పంచప్రాణాలుగా చేసి నీకు బహూకరించగలను..!! 

సకల జగత్తును నీకు జాతీయం చేయగలను..!! 

దేవుడిని నీకు దానంగా ఇవ్వగలను..!!

అన్నింటికన్నా నా ఒక్కగానొక్క జీవితాన్ని నీకు సమర్పించగలను..!! 


కలం పేరు:- అఖిలాశ

మీ 
 జాని.తక్కెడశిల

Friday 2 December 2016



పంచరామాలు:-

ఆమరేంద్ర ప్రతిష్టమ్ దంతవర్ణ శివత్మలింగం 
కస్యర్తి గౌతకౌశిక వశిష్ఠ జమదాభరద్వ పూజ్యమ్ 
శ్వరుస్వజుడిచ్చిన జగత్రక్ష అసురాంతమ్ అమరారామమ్ 
నన్ పుట్టించినమ్మకు నర్పితమ్ సుమా..!!!
భావం:- 
-------
ఇంద్రుడు ప్రతిష్టించిన శివలింగం, దంత వర్ణంలో ఉంటుంది  
ఏడు రుషులతో పూజలు అందుకున్న శివలింగం 
కశ్యప,అత్రి,గౌతమ,కౌశిక,భరద్వాజ, వశిష్ఠ , జమదగ్ని 
అమరేంద్రుడు ప్రతిష్టించాడు కావున అమరరామము అయినది 
అసురుడిని అంతం చేసిన కారణం చేత అమరరామం ప్రతిష్టించారు 
  
సోముడి షోడశ కళనిలయ సోమాత్మలింగం 
గర్భమ్ ఉమాసోమేశ్వరమ్ నేత్తినన్నపూర్ణ క్షేత్ర 
జానార్ధన దర్శనమ్ సకల పాపమున్ హరింపుమ్ 
నన్ పుట్టించినమ్మకు నర్పితమ్ సుమా..!!!
భావం:- 
-------
ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్టించాడు.చంద్రునిచే ప్రతిష్ఠించబడినది కావున దీనికి సోమారామము అని పేరు వచ్చింది.చంద్రుని షోడష కళలు దర్శనం ఇస్తాయి. గర్భగుడిలొ అమ్మవారు ఉమామహేశ్వరిగా శివలింగంపై గంగదేవి దర్శనం క్షేత్ర పాలకుడిగ జనార్ధన స్వమివారు ఉన్నారు. దర్షించిన సకల పాపలు హరిస్తాయి 
క్షీరజట త్రిశూలధారి రామలింగేశ్వరం 
శిల్పగోపుర దర్శనం నేత్రనందమ్ 
స్వయంబు శేఖర అమృతలింగ శిరోభాగమ్ 
నన్ పుట్టించినమ్మకు నర్పితమ్ సుమా..!!!
భావం:- 
-------
ఇక్కడ స్వామి వారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు ఇద్దరూ ప్రతిష్ఠించారు 
శివుడు తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమినుండి పాలధార ఒకటి వచ్చిందట. క్షీరం అనగా పాలు దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది.ఇక్కడి శిల్ప గోపురం చాల బాగా ఉంటుంది  
  
మాణిక్యాంబ సమేత విబూదిప్రియమ్ 
శిల్పసౌందర్య నందిశ్వరమ్ సూర్య ప్రతిష్టమ్ 
దక్షయజ్ఞస్థల దర్శనమ్ పాపహరణమ్ సుమీ 
నన్ పుట్టించినమ్మకు నర్పితమ్ సుమా..!!!
భావం:- 
-------
ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు.కనుక ఈ ప్రాంతానికి ద్రాక్షారామము అని పేరు వచ్చిందంటారు.
ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు. సగభాగం నలుపుతో ఉంటుంది.
సూర్య భగవానుడు ప్రతిష్టించాడు. ఇక్కడి నందిపై శిల్ప సౌందర్యం బహు బాగా ఉంటుంది. దర్శించినచో పాప హరణమే.  
కుమార స్థాపిత కుమారభిమేశ్వరమ్ 
ఏకశిల నందిశ్వరమ్ రాతిస్తంభ వైభవమ్ 
పంచరామ దర్శనమ్ మోక్షమిచ్చున్ గదా
నన్ పుట్టించినమ్మకు నర్పితమ్ సుమా..!!!
భావం:- 
-------
కుమార
కుమారస్వామి ప్రతిష్టించాడు కావున కుమారభిమారామము. ఏక శిల నంది,ఇక్కడి రాతిస్తంభం చాల బాగా ఉంటాయి. పంచరామల దర్షనం మోక్షాన్ని ప్రసాదిస్తాయి సుమా..

కలం పేరు:- అఖిలాశ

మీ 
 జాని.తక్కెడశిల